ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ
*7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ*
విశాఖపట్నం,2024, మే 3,టుడే న్యూస్ : రాజమహేంద్రవరం లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు.
సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు.
8న సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొని, రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు.
ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్, కార్యక్రమ నిర్వాహకుల వివరాల్ని భాజపా బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది