*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు గౌ||శ్రీ || విజయసాయి రెడ్డి గారిని విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో శనివారం మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన సహకార సంస్థ చేర్ప పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి గారు, విశాఖపట్నం జిల్లా పరిషత్ చేర్పర్సన్ సుభద్ర గారు, ఎస్ కోట మాజీ MLA శోభా హైమావతి గారు*
డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖపట్నం: టుడే న్యూస్, జనవరి:-27 పేదల వైద్యుడిగా, పోలియో వ్యాధి బాధితుల పాలిట ఆత్మబంధువుగా పేరు గాంచిన ప్రముఖ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ పురస్కారం లభించడం మన తెలుగు వారందరికీ గర్వకారణమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు ఇటివల కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలలో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణరావును ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా వైద్య రంగంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారని మంత్రి కొనియాడారు. పోలియో ఆపరేషన్స్ లో వరల్డ్ రికార్డు సాధించడం ఎంతో గర్వించే విషయమని అన్నారు. వైద్యరంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయనకు దక్కిన పద్మ పురస్కారం మొత్తం వైద్యరంగానికే వచ్చిన గుర్తింపు అని మంత్రి అన్నారు. ఓపక్క వైద్య వృత్తితోపాటు మరోపక్క వైద్య రంగంలో విద్యార్ధులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరింత మంది పేద ప్రజలకు వైద్యం అందించాలని మం...