రేషన్ సరుకుల పంపిణీలో పొరపాట్లు జరిగితే కఠిన చర్యలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు


       



                 

విశాఖపట్నం,2023 జనవరి10,టుడే న్యూస్: చౌకధరల దుకాణాలలో మరియు ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాలలో 

సరుకుల పంపిణీలో పొరపాట్లు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు అన్నారు. మంగళవారం సాయంత్రం సివిల్ సప్లై అధికారి సూర్య ప్రకాష్ రావుతో కలిసి ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు నగరంలో పలు రేషన్ డిపోలను, రేషన్ పంపిణీ వాహనాలను తనిఖీ చేశారు. ముందుగా పూర్ణా మార్కెట్ ఏరియాలో గల డిపో నెంబర్ 0386149 ను తనిఖీ చేశారు. బియ్యం స్టాక్ ఎంత వచ్చింది, ఎంత పంపిణీ చేశారు, ఎంతమంది కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, రైస్ కార్డ్లు ఎన్ని ఉన్నాయి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కార్డ్ హోల్డర్స్ తో మాట్లాడి రేషన్ పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని, తక్షణ చర్యలు చేపడతామన్నారు. అనంతరం రైల్వే న్యూ కాలనీ దగ్గరలో గల చౌకధర దుకాణం నెంబర్ 39 ని తనిఖీ చేసి స్టాక్ సరిగా లేనందున మరియు రిజిస్టర్ సక్కమంగా లేనందున అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. అనంతరం హెచ్ బి కాలనీ సీతమ్మధారలో డిపో నెంబర్ 569ను తనిఖీ చేశారు. 

ఈ కార్యక్రమంలో ఎఎస్ఓ లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్