జయపురం మహారాణి అంత్యక్రియలు పూర్తి
విశాఖపట్నం,2023 జనవరి 3, టుడే న్యూస్ :
ఒడిశాలోని జయపురం చివరి మహారాణి ,వి. మాడుగుల మాజీ ఎమ్మెల్యే రమాకుమారిదేవి(93)
అంత్యక్రియలు నిరాడంబరంగా జరిగాయి.
సోమవారం తన రాజ భవనం మోతీ ప్యాలెస్ లో ఆమె తుది శ్వాస విడిచారు. మహారాజా విక్రం దేవ్ సోదరుడు రామకృష్ణ చంద్ర దేవ్ భార్య అయిన రమా కుమారి దేవి 1962లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని వి. మాడుగుల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే పోటీ చేసి గెలి చారు. ఆమె పాలించిన 1951-52 సమ
యంలో మోతీ ప్యాలెస్ (జయ పురం) హవా మహల్ నిర్మించారు.ఆమె అంత్యక్రి యలు చందన్వాడలోని రాజ శ్మశానంలో రాజవంశీయులు యువరాజ్
విశ్వేశ్వర చంద్ర ఛూడ్ దేవ్, మహారాణి సారికాదేవి,
చేతుల మీదుగా జరిగాయి.జయపురం జిల్లా కలెక్టర్ తో పాటు కిషన్ రాథోడ్, ఊరి పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.