విశాఖ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కూన కాళిదాసు కి గౌరవ డాక్టరేట్.
విజయవాడ పున్నమి ఘాట్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమం లో డాక్టరేట్ ని అందజేసిన అమెరికా గుర్తింపు పొందిన హెచ్. ఎస్. సి యూనివర్సిటీ.
హర్షం వ్యక్తం చేస్తున్న పలు సంస్థలు
విజయవాడ,2022 డిసెంబర్ 9 టుడే న్యూస్ :
విజయవాడ పున్నమి ఘాట్ లో జరిగిన యూనివర్సిటీ జాతీయ అవార్డు ల స్నాతకోత్సవ కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్ట్ కూన కాళిదాస్ కి అమెరికా గుర్తింపు పొందిన హాలీ స్పిరిట్ క్రిస్టియననిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసి ఘనంగా సన్మానం చేశారు.ఈ హెచ్ ఎస్ సి యూనివర్సిటీ నేషన అసోసియేషన్ ఫర్ థియలాజికల్ అసోసియేషన్ (నాటా ), ఇండియా, డే స్ప్రింగ్ థియలాజికల్ యూనివర్సిటీ, టెక్ససెస్, యూ. ఎస్.ఎ లకు గుర్తింపు ఉంది.. సమాజ హితమే పరమావది గా కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ, ఆదివాసీ సమస్యలపై అనేక కథనాలను, ఇంటర్వ్యూ లను కాళిదాసు రాస్తున్నారు. ముఖ్యంగా తన కలాన్ని, గళాన్ని ప్రజల సమస్యల సాధన దిశగా అంకిత భావం తో పనిచేస్తున్నందుకు, బెస్ట్ సోషల్ సర్వీస్ విభాగం లో సోషల్ జర్నలిజనికి ఈ గౌరవ డాక్టరేట్ను ఇస్తున్నామని హెచ్ ఎస్.సియూనివర్సిటీ అధికార ప్రతినిధులు తెలిపారు. కన్నుల పండుగ గా జరిగిన ఈ స్నాతకోత్సవం యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ సుమన దయాల్, రాష్ట్ర కో -ఆర్డినేటర్ డాక్టర్ వరప్రసాద్,డాక్టర్ జి. శ్యాముల్ జాన్, డాక్టర్ ప్రేమానందం, ఎమ్. ఎస్. దయయానంద్,అడ్మినిస్ట్రేటర్ కె. శాంతి ప్రియా లు ఈ స్నాత కోత్సవం లో పాల్గొన్నారు.కో ఆర్డినేటర్ శ్వేత ఆధ్వర్యంలో ప్రదర్శించిన పలు సాంసృతిక కార్యక్రమాలను సభికులను అలరించాయి డాక్టర్ కూన కాళిదాస్ కుఈ గౌరవ డాక్టరేట్ ను రావడం పట్ల కుటుంబ సభ్యులు బెండి అరుణ, కూన వర్షిణి, బెండి శ్రీనివాస్, దవిల అనిత, దవిల మణి,,పలు సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు