సమాజంలో జర్నలిస్టులో పాత్ర అత్యంత కీలకం: ఏయూ ఉపకులపతి ఆచార్య ప్రసాద రెడ్డి
*ప్రభుత్వానికీ ప్రజలకూ మధ్య వారధి మీడియానే*
*సమతూకంతో సహేతుకతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.*
విశాఖపట్నం,2022 డిసెంబర్ 28, టుడే న్యూస్: ప్రజలకూ ప్రభుత్వానికీ వారధిగా సమాజంలో జర్నలిస్టులు అత్యంత కీలకమైన భూమికను పోషించాల్సి ఉందని ఆంధ్రవిశ్వవిద్యాలయం
ఉప కులపతి ఆచార్య పిజివిడి ప్రసాద రెడ్డి పేర్కొన్నారు. బుధవారం డాబాగార్డెన్స్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన నూతన సంవత్సరం 2023 స్వాగత కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆచార్య పిజివిడిప్రసాద రెడ్డి నూతన సంవత్సరం డైరీని ఆవిష్కరించారు. ఈ
సందర్భంగా ఆచార్య ప్రసాద రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు సమతూకంగా తమ కథనాలతో సమాజాన్ని మేల్కొలపడంలో బాధ్యత
వహించాల్సి ఉందన్నారు. ఫోర్తు ఎస్టేట్ జర్నలిజం వృత్తిలోకి వచ్చిన వారు నిబద్ధతతో ఉంటూ రాగద్వేషాలకు అత్యం
అతీతంగా
త కీలకమైన బాధ్యతను నిర్వర్తించాలన్నారు. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ నిరంతరం న్యూస్ సేకరణలో ఉండే జర్నలిస్టులు తమఆరోగ్యాన్ని
పరిరక్షించుకుంటూ తమ కుటుంబ సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ వహించాలని సూచించారు. బంగారు అశోక్ కుమార్ అధ్యక్షులుగా
ఉన్న స్మార్టు సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వంటి జర్నలిస్టు సంఘాలు ఈ విషయంలో అండదండగా నిలవడం అభినందనీయం
అన్నారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ జర్నలిస్టులతో మమేకమై ఎప్పుడూ ఉంటుందని చెప్పిన ఆయన కొత్త సంవత్సరంలో జర్నలిస్టులూ
వారి కుటుంబీకులూ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. సీనియర్ జర్నలిస్టు నాగనబోయిన నాగేశ్వర రావు(ఎన్ఎన్ఆర్)
మాట్లాడుతూ జర్నలిస్టులతో ఏయూ ఉపకులపతి ఆచార్య ప్రసాదరెడ్డి నూతన డైరీ ఆవిష్కరణలో పాల్గొనడం ఆనందదాయకం
అన్నారు. మంచి వ్యక్తిగా జర్నలిస్టులతో సన్నిహితంగా మెలిగే ఆచార్య ప్రసాదరెడ్డి ఔన్నత్యాన్ని ఈసందర్భంగాఎన్ఎస్ఆర్ కొనియాడా
రు. వచ్చే 2023వ సంవత్సరం జర్నలిస్టులకూ, వారి కుటుంబ సభ్యులకూ మేలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ అప్పారావు (శ్రీనివాస్) కర్యదర్శి నివేదికను వినిపించిన కార్యక్రమంలో ఎస్సీఆర్ డబ్ల్యుఎ వ్యవస్థాపక అధ్యక్షులు
బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ సంస్థ ఆవిర్భావం, సభ్యుల సంక్షేమం కోసం సంస్థ తరపున చేస్తున్న కార్యకలాపాలను
వివరించారు. పాత్రికేయుల కోసం పాత్రికేయులు స్వయంగ నడుపుతున్న ఆదర్శ సంస్థ ఎస్సీఆర్
డబ్ల్యుఎ అన్నారు. నిరంతరం పాత్రికేయుల సంక్షేమం కోసం పరితపించే సంస్థగా వారి యోగ క్షేమాలు, కష్ట నష్టాల్లోనూ పాలుపంచుకుంటూ ఎప్పుడూ వెన్నంటే పాత్రికేయ
లతోనే ఉంటున్న సంస్థగా ఆయన చెప్పారు. నిత్యం న్యూస్ కవరేజీలో ఉండే జర్నలిస్టులు తమ కుటుంబ సంక్షేమం పట్టించుకునే
వకాశాలు అటు వృత్తిపరమైన ఒత్తిడి వల్ల కానీ, ఇటు ఆర్ధిక ఇబ్బందుల వల్లన కానీ వీలుకాని పరిస్థితులు స్వయంగా తెలిసిన ఎసి సిఆర్
డబ్ల్యుఎ సంస్థ అన్ని విధాలుగా అండగా, దన్నుగా ఉంటూ సమాజానికి జర్నలిస్టులు ఎంత ముఖ్యమో అంతే ముఖ్య పాత్రను జర్నలిస్టు
ల తరఫునా వహిస్తూన్న జర్నలిస్టు సంఘం ఎస్సిఆర్
డబ్ల్యుఎ అన్నారు. గడచిన హుదూద్, వేధించి వెళ్లిన కోవిడ్ మహమ్మారి వంటి ఉప
ద్రవాల్లో నేనున్నానని అండగా నిలిచిన ఎస్సిఆర్ డబ్ల్యుఎ ప్రతి సేవా కార్యక్రమం వెనుకా సభ్యుల ఆకాంక్ష అవసరం, వారిచ్చిన ప్రోత్సహమే కారణం అన్నారు. నిత్యం జర్నలిస్టుల సంక్షేమం కోసమే పరితపించే ఎస్సిఆర్డబ్ల్యుఎ భవిష్యత్తులో సొంత భవనం ఏర్పాటు చే
సి, జర్నలిస్టుల రిక్రియేషన్కు ఒక శాశ్వత ప్రాంగణం కోసం ప్రయత్నిస్తుంది. మళ్లీ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్న కోవిడ్ కొత్త వేరియెంట్ జర్నలిస్టులూ, వారి కుటుంబీకుల జోలికి రాకుండా ఉండాలని, వీలైనంతలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మెలగాలని ఆయన సూచించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి ప్రదర్శనలు అలరించాయి. భరత ఖండమే నా దేశం అంటూ ఎస్ఎస్వి అపర్ణ ప్రదర్శించిన కూచిపూడి నృత్యంతో పాటూ ఇతర సాంస్కృతిక ప్రదరర్శనలూ ఆక
ట్టుకున్నాయి. సభ్యులకు ఆచార్య ప్రసాదరెడ్డి, ఎన్ఎన్ఆర్, అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్లు డైరీలు స్వీట్లు, పండ్లు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలోఎస్సిఆర్డిడబ్ల్యుఎ కార్యవర్గ కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్,కోశాధికారి అశోక్ రెడ్డి,ఉపాధ్యక్షులు నాయుడు, లక్ష్మణ్,పద్మజ,ముఖ్య సలహదారులు కర్రి సత్యనారాయణ,సభ్యులు వినోద్,శ్రీనివాస్,శరత్,సూరిబాబు,శిరీష,రవి,గౌరీ మమేకమయ్యారు.