సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకం : సౌత్ జోన్ ఏసీపీ త్రినాథరావు

 


*ఎస్సిఆర్డబ్ల్యూఏ గాజువాక యూనిట్ జర్నలిస్టులకు డైరీ,స్వీట్స్ పంపిణీ

విశాఖపట్నం,2022  డిసెంబర్ 29, టుడే న్యూస్ :సామాజిక శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని సౌత్ డివిజన్ ఏసిపి త్రినాధరావు అన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బంగారు అశోక్ ఆధ్వర్యంలో అసోసియేషన్ 2023 నూతన డైరీ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసిపి త్రినాథరావు పాల్గొని ఆయన చేతుల మీదగా డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజ శ్రేయ ధ్యేయంగా జర్నలిస్టులు అందిస్తున్న సేవలను కొనియాడారు. అసోసియేషన్ తరపున చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలలో తనను కూడా భాగస్వాములు చేస్తే సంతోషంగా ఉంటుందన్నారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు బంగారు అశోక్ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్ట్ ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలనేది అసోసియేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి సుమారు  6 ఏళ్ళు అవుతొందన్నారు. ఈ ఆరేళ్లలో అసోసియేషన్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని,ప్రతిభ గల బీద విద్యార్థులకు అందిస్తూ సమాజ సేవలో తమ వంతు బాధ్యతను  నిర్వర్తిస్తున్నామని అన్నారు.  జర్నలిస్టులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే  అసోసియేషన్ తరపున  ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి అండగా నిలబడడం జరుగుతోందని చెప్పారు. సభ్యుల సహాయ సహకారాలతో అసోసియేషన్ ను మరింత బలోపేతం చేయడానికి అలాగే అసోసియేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం జర్నలిస్ట్ లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.అనంతరం సౌత్ జోన్ ఏసీపీ త్రినాథరావు,88వ వార్డు వైసీపీ అధ్యక్షులు గంగా మహేష్ చేతుల మీదుగా సభ్యులకు డైరీ , స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్(కిరణ్),కోశాధికారి అశోక్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు శిరీష తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్