స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
విశాఖపట్నం,2024, మే 10, టుడే న్యూస్: ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీలక్ష్మి వరాహనృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి, అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని, స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత. ‘యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం’ అంటే అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణుసాన్నిధ్యం కలుగుతుందని అర్థం. ఇదియే అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరపిస్తారు. ఈరోజు చేసే జప,తప,హోమ,తర్పనాదులు అక్షయమై పుణ్యఫలానిస్తాయని, అక్షయ తృతీయ బుధవారం, రోహిణి నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలమని అంటారు. కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రాక్షస రాజులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల క్రూరస్వభావం ముల్లోకాలను గడగడలాడించింది. హిరణ్యాక...
విశాఖపట్నం, 2024, మే 9, టుడే న్యూస్ : గురువారం భీమిలి నియోజకవర్గము లో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ సమన్వయకర్త కిరణ్ కుమార్ శర్మ అధ్యక్షతన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది. కార్యక్రమములో ముఖ్య అతిథులు గా పాల్గొన్న కూటమి పార్లమెంట్ అభ్యర్ధి భరత్, భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ మాట్లాడుతూ దేశములో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ జాతి అభివృద్ధికి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబునాయుడు కి దక్కుతుంది అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో లో కూడా బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రేపు అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణుల హక్కులను కాపాడుతూ వారి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. కార్యక్రమములో బ్రాహ్మణ ప్రముఖులు సుసర్ల హరి, పరిమి నాగేంద్ర, పురుషోత్తమరాజు, రామశాస్త్రి, బాబీ, ప్రైవేటు అర్చక పురోహిత సంఘ సభ్యులు కాళిదాసు, సుదీర్, బాలు శర్మ, కృష్ణశర్మ, కామేశ్వర శర్మ, శివగణేష్, విస్సు, మొదలైనవారు పాల్గొన్నారు.
విశాఖపట్నం,ఎన్ఎన్ఇ న్యూస్: నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నేమాల హేమ సుందరరావు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారాన్ని అందుకున్నారు. మహాకవి శ్రీశ్రీ 112 వ జయంతి సందర్భంగా శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యాన ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో శనివారం జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కవి సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో కవులు రచయితలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీ శ్రీ కళా వేదికకు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ అందిస్తున్న మీడియా సహకారానికి కృతజ్ఞతగా ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆరవల్లి నరేంద్ర ఇతర ప్రతినిధులు పూలమాలవేసి దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు.