ఖమ్మంలో టీ-టీడీపీ శంఖారావం సభలో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు
హైదరాబాద్,2022 డిసెంబర్ 21,టుడే న్యూస్:
*తెలంగాణలో టీడీపీ లేదు అన్నవాళ్లు కు ఈ ఖమ్మం సభ సమాధానం*
*రాష్ట్రానికి అభివృద్ధి నడక నేర్పింది తెలుగు దేశం*
*టీడీపీ ఆవిర్భావంతోనే బడుగు వర్గాలకు రాజ్యాధికారం*
*పార్టీ వీడిన నాయకులకు తిరిగి స్వాగతం*
*ఇక తెలంగాణ టీడీపీ పునర్నిర్మాణం...పూర్వ వైభవం:- సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రసంగం*
• చాలా సార్లు ఖమ్మం వచ్చాను...ఈ స్థాయిలో స్వాగతం ఎప్పుడూ చూడలేదు
• హైదరాబాద్ నుంచి అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు.
• ప్రజలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చారు.
• మాకు ఐటీ ద్వారా ఉపాధిని ఇచ్చారనే అభిమానంతో యువత కదలి వచ్చింది.
• ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి జరపుకుంటున్నాం. టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది.
• తెలుగు వాళ్ల కోసం తెలంగాణ గడ్డపై నాడు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టారు.
• సమైఖ్య రాష్ట్రంలో టీడీపీ పాలనతో పెనుమార్పులు వచ్చాయి.
• అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్
• జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పిన వ్యక్తి ఎన్టీఆర్
• రెండు రూపాయాలకే కిలో బియ్యంతో ఆహారభద్రతకు బీజం వేసింది ఎన్టీఆర్
• తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం ఇచ్చిన నేత ఎన్టీఆర్
• సింగిల్ విండో విధానంతో పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు పెట్టారు.
• ఎన్టీఆర్ తెలుగు వాడి ఆత్మగౌరవం కాపాడారు. నేను తెలుగు వారిలో ఆత్మవిశ్వాసం నింపాను.
• ప్రజల్లో ఆత్మ విశ్వాసం నింపితే ప్రపంచాన్నే జయిస్తారని తెలుగు దేశం పార్టీ నిరూపించింది.
• నేను వయసులో పెద్దవాడిని అయినా...యువకుడిలా ఆలోచిస్తాను.
• రాబోయే 30 ఏళ్లలో ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి పని చేస్తాను. ఇదే నా విధానం.
• నేను ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఎప్పుడూ పని చేయలేదు.
• బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో మనసు విప్పి మాట్లాడాను. యువతకు వివరించాలని అన్నీ విషయాలపై మాట్లాడాను.
• హైదరాబాద్ అభివృద్ధికి కారణం ఎవరు? మనమే చేశాం. నాడు ఫౌండేషన్ వేశాము.
• నేను ఐటీలో అవకాశాలను ముందుగానే ఊహించి హైటెక్ సిటీ ప్రారంభించాను.
• దేశ విదేశాలు తిరిగి కంపెనీలు తెచ్చాను. బిల్ గేట్స్ ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ తెచ్చాను.
• నాడు జినోం వ్యాలీ తీసుకురావడం వల్లే నేడు కరోనా వ్యాక్సిన్ వచ్చింది.
• టెలికమ్యూనికేషన్ సంస్కరణలతో మొబైల్ ఫోన్ రావడానికి కారణం అయ్యాము.
• పాలసీనే మార్చి హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ తెచ్చాము.
• నాడు ప్రధాని వాజ్ పేయికి చెప్పి ఒప్పించి.... స్వర్ణచతుర్భుజం ప్రాజెక్టు తెచ్చాము. దీంతో రాష్ట్రంలో విశాలమైన రోడ్లు వచ్చాయి.
• స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి కాసాని, యనమల, దేవేందర్ గౌడ్ వంటి వారికి అవకాశాలు ఇచ్చాము.
• మహేందర్ నాథ్, ప్రతిభా భారతి, బాలయోగి వంటి వారికి ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీ తెలుగు దేశం పార్టీ.
• బడుగు బలహీన వర్గాలను అధికారంలో భాగస్వాములు చెయ్యాలని చెప్పింది. చేసింది టీడీపీ.
• 30 ఏళ్ల క్రితమే మహిళలకు ఆస్థిహక్కు ఇచ్చిన నేత ఎన్టీఆర్.
• మహిళలకు ప్రత్యేక యూనివర్సిటీ తెచ్చిన పార్టీ తెలుగు దేశం పార్టీ
• తెలుగు దేశం ఎక్కడ అని అడిగేవాళ్లకు ఈ సభే సమాధానం.
• రెండు రాష్ట్రాలు మళ్లీ కలిపేస్తాం అని కొందరు బుద్దిలేని మాటలు మాట్లాడుతున్నారు.
• గాడి తప్పిన ఏపీని మళ్లీ గాడిన పెట్టే బాధ్యత నాది.
• అదేవిధంగా తెలంగాణలో కాసాని లాంటి నాయకులతో టీడీపీ ఆశయాలను నెరవేర్చుతాం.
• రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కలిసి పనిచేసుకుంటే ఉత్తమ రాష్ట్రాలు అవుతాయి.
• తెలుగు రాష్ట్రాలు దేశంలో మొదటి, రెండో రాష్ట్రాలుగా ఉండాలి అని కలలుగన్నాను.
• తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చింది టీడీపీ. నల్గొండలో ఫ్లోరైడ్ బాధితుల కష్టాలు తీర్చింది టీడీపీ.
• తెలంగాణలో ఉన్న నేతలు అంతా యాక్టివ్ కండి. కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.
• తెలుగు దేశం పార్టీ నుంచి కొందరు నేతలు బయటకు వెళ్లారు.
• ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేకుండా సభ ఇంత ఘనంగా జరిగింది.
• ఇదీ తెలుగుదేశంకు ఉన్న ప్రజాబలం.
• తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేస్తుంది.
• విభజన చట్టంలో ఉన్న అంశాలను నెరవేర్చాలి. తెలంగాణలో కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు జరగాలి.
• ఈ సభా ప్రాంగణం కట్టింది కూడా మనమే. ఖమ్మంలో జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ చేసిందే.
• ఇక్కడ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది టీడీపీనే.
• అన్ని రాజకీయపార్టీల కంటే తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఉంది.
• నాడు మనవల్లే అభివృద్ధి జరిగింది. దీని వల్ల లబ్దిపొందిన వాళ్లు టీడీపీ గురించి ఆలోచించాలి.
•మళ్లీ సమాజంలో శక్తిమంతమైన నాయకత్వం సిద్ధం కావాలి అంటే రావాల్సింది టీడీపీనే.
• టీడీపీని పునర్ నిర్మాణం చేద్దాం. పూర్వ వైభవం తీసుకువద్దాం.
• మీ కోసం పని చేసిన తెలుగుదేశంపార్టీని మళ్లీ నిలబెటమని తెలంగాణ ప్రజలను కోరుతున్నాను.
• సుబాబుల్ రైతులు తెలంగాణలో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.
• ప్రభుత్వాలకు ఆదాయాలు పెరుగుతున్నాయి. ఆదాయాన్ని పేదలపై ఖర్చు పెట్టి ఆర్థిక అసమానతలు తొలగించాలి.
• ఖమ్మం సభ చూసిన తరువాత ధైర్యం వచ్చింది. నమ్మకం పెరిగింది.
• తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పుంజుకుంటుంది.
•ఏపీ కంటే ఎక్కువ అభిమానం తెలంగాణలో కనిపిస్తుంది.
• 25 ఏళ్ల క్రితం మనం చేసిన పనులు గుర్తుచేసుకుంటున్నారు. నీరాజనాలు పలుకుతున్నారు.
• సభను సక్సెస్ చేసిన అందరికీ అభినందనలు.
• ఖమ్మంలో జరిగిన మీటింగ్.. టీడీపీని తిరుగులేని పార్టీగా తయారు చేస్తుంది.
• తెలంగాణలో టీడీపీ అవసరం ఉంది. నేతలు అంతా రావాలని స్వాగతిస్తునామన్నారు.
• దారిపొడవునా అభిమానంతో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.