“ఆప్ కీ ఆవాజ్” రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా :గంట్ల


 


  *ఉత్తర్వులు అందజేసిన కార్యవర్గం 

   *ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం 

విశాఖపట్నం, 2022అక్టోబర్-04, టుడే న్యూస్ :

 “ఆప్ కీ ఆవాజ్” రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా నగరానికి చెందిన గంట్ల శ్రీనుబాబును నియమిస్తూ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పివిజి విశ్వనాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబందించిన ఉత్తర్వులను మంగళవారం డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యాలయంలో శ్రీనువాబు కు ఈ ఉత్తర్వులు అందజేయడం జరిగింది. అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యుడిగా, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడుగా, నేవల్ డాక్ యార్డు ఉద్యోగుల సంఘం(కెటి బి) గౌరవ అధ్యక్షుడిగా విశేష సేవలందిస్తున్నారు.ఈ మేరకు  ఆయన సేవలను పరిగణలోకి తీసుకుని తమ కార్యవర్గంలో రాష్ట్ర ఉపాధక్ష్యుడుగా నియమించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌ తెలిపారు.తమ సంస్థ ప్రజలకు ఆయా రంగాల్లో ఉచితంగా సేవలందిస్తుందన్నారు.ప్రధానంగా వినియోగదారుల హక్కులు, మానవ హక్కులు, ఉమెన్‌ ఎన్‌పవర్‌మెంట్‌, యూత్‌ వెల్పర్‌,రైట్‌ టూ ఇన్‌ఫర్‌మేషన్‌ వంటి అనేక రకాల సేవలను అందిస్తున్నామన్నారు. తమ న్యాయవాదుల ద్వారా అనేక సమస్యలను ఇప్పటికే పరిష్కరించగలిగామన్నారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ తనకు కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. శక్తివంచన లేకుండా తన వంతు సేవలు అందిస్తామన్నారు.ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థ ద్వారా ఎంతో మంది తగిన సహయం పొందడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌, ఉపాధ్యక్షుడు ఎన్‌పి రాజు,తదితరులు పాల్గొన్నారు.






ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్