ఎర్ర చందనం డైరెక్ట్ ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న వైకాపా నేతలు:టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపణ

 



తిరుపతి, 2022అక్టోబర్ 17, టుడే న్యూస్: తిరుపతి,   చిత్తూరు, అన్నమయ్య  జిల్లాలకు చెందిన వైకాపా నేతలు కొందరు అడ్డు అదుపు లేకుండా ఎర్ర చందనం డైరెక్ట్ గా ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరగేదని ఆయన తెలిపారు. అయితే ఏడాది నుంచి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో,  పలుకు బడి కలిగిన కొందరు నేతలు నేరుగా ఎర్ర చందనం తరలిస్తున్నారని ఆరోపించారు. దీనిపై తాను తొలి నుంచి ఆరోపణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేదని విమర్శించారు. ఆదివారం పెనుమూరు మండలంలోని దేవలంపేట రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఎర్ర చందనం రవాణా చేస్తున్న రెండు వాహనాలు పట్టు బడ్డాయని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు పారిపోగా   ఒక వ్యక్తి తో పాటు 28 దుంగలు దొరికాయని  చెప్పారు. ఈ వాహనాలు కె వి పల్లె నుంచి నెండ్రగుంట, పెనుమూరు, కొత్తపల్లిమిట్ట మీదుగా చెన్నై వెళుతున్నాయని తెలిపారు. ఈ వివరాలు చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపినవేనని అన్నారు. కాగా వైకాపాలో నేతల్లో ఇటీవల తలెత్తిన వర్గ పోరు వల్ల కొందరు పోలీసులకు ఉప్పు అందించి పట్టించారని చెప్పారు. గతంలో జి డి నెల్లూరు, ఎస్ ఆర్ పురం, కోడూరు తదితర ప్రాంతాలలో ఎర్ర చందనం దుంగలు దొరికాయన్నారు. శేషాచలం అడవుల చుట్టూ ఉన్న మూడు జిల్లాలకు చెందిన కొందరు వైకాపా నేతలు ఎర్ర చందనం అక్రమ వ్యాపారం చేసి కోట్లు గడిస్తున్నారని అరోపించారు. ఇప్పటికైనా అధికారులు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుని ప్రకృతి సంపదను కాపాడాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం