అభివృద్ధి వికేంద్రీకరణ-విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే అంశంపై వ్యాసరచన పోటీలు



విశాఖపట్నం, 2022, అక్టోబర్ 16, టుడే న్యూస్:  చైతన్య స్రవంతి సంస్థ ఆధ్వర్యంలో,అధికార వికేంద్రీకరణ వల్లే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమ‌ని, అన్ని సదుపాయాలు ఉన్న విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండాలని ఈ ప్రాంత యువతీ యువకులు, ప్రజలు కోరుకుంటున్నారని చైతన్య స్రవంతి అధ్యక్షురాలు  షిరీన్ రహమాన్ అన్నారు.

 విశాఖ పాత నగరం లో గల  ఎం.వి.డి.ఎం స్కూల్ ఎదురుగా ఉన్నఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ హాల్లో

 ఆదివారం ఉదయం అభివృద్ధి వికేంద్రీకరణ, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.175 మంది యువతీ యువకులు ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలకు

మాజీ ఎమ్మెల్యే వైకాపా సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్.ఏ. రెహమాన్,

నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్స్లర్  బాల మోహన్ దాస్,ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షులు, విజన్ దినపత్రిక ఎడిటర్ ఎస్.ఎస్ శివ శంకర్,కార్పొరేటర్ సాదిక్ ఈ వ్యాసరచన పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

వ్యాసరచన పోటీల్లో విజేతలు వీరే...

చైతన్య స్రవంతి సంస్థ ఆధ్వర్యంలో

అభివృద్ధి వికేంద్రీకరణ,

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే అంశంపై యువతీ యువకులకు నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి ఆసియా బేగం, ద్వితీయ బహుమతి కే. భవ్య, తృతీయ బహుమతులు

 జి. సూర్య, బి. షహనాయి, ప్రోత్సాహక బహుమతులు పీ.వసంత్, మహమ్మద్ ముస్కాన్, పి.లహరి, వి. గోపీచంద్, 

టి. వేగ్నేష్, జి సంతోషి భవాని, ఎస్. ఉషశ్రీ, ఆబీద అందుకున్నారు.

చైతన్య స్రవంతి అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రెహమాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణ వల్ల  అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని

అందుకే అన్ని రాష్ట్రాలు అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నాయని  చెప్పారు. ముఖ్యంగా అన్ని అర్హతలూ ఉన్న విశాఖ పరిపాలన రాజధానిగా కాకుండా ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పరిపాలన వికేంద్రీకరణ-సమ్మిళిత అభివృద్ధి రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. తమ సంస్థ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో యువతీ,యువకులు తమ యువవాణి వినిపిస్తూ రాష్ట్రానికి విశాఖ పరిపాలన రాజధానిగా ఉండాలని కోరారని తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వైకాపా సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్.ఏ. రెహమాన్ మాట్లాడుతూ గ‌తంలో హైద‌రాబాద్‌లోనే అన్ని కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డంతో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృత‌మైందని, ప్రభుత్వ రంగ సంస్థలు, 90 శాతం  ప్రైవేట్ సంస్థ‌లు, సాప్ట్‌వేర్ సంస్థ‌లు హైద‌రాబాద్‌లోనే ఉన్నాయని అందువ‌ల్లే రాష్ట్ర విభ‌జ‌న సమయంలో పెద్ద ఎత్తున నష్టపోయన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి... అన్ని చోట్లా అందరం కలిసి ఉండాల‌న్న‌దే వైకాపా ప్ర‌భుత్వ ల‌క్ష్యమన్నారు.   ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలు కూడా సంతోషంగా ఉండాల‌ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్న మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లు త్వరలో తీసుకురావడానికి దృఢనిశ్చయంతో కంకణం కట్టుకున్నారని అన్నారు. నాగార్జున యూనివర్సిటీ పూర్వ కులపతి డాక్టర్ బాల మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రాంతాల అభివృద్ధిలో, పాలనలో వివక్ష చూపితే వెనుకబాటుతనం వల్ల  ఉద్యమాలు తప్పవన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో నిరక్షరాస్యత, పేదరికం, ఆకలి వంటలు, నిరుద్యోగం ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అభివృద్ధి, పాలనలో వివక్షతకు గురికావడమే ఈ ప్రాంతాల వెనుకబాటుతనానికి ప్రధాన కారణమన్నారు.  అమరావతి రాజధాని పేరుతో సొమ్మంతా ఒకేచోట ఖర్చు చేసి ఆపై రాష్ట్రం విడిపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఎలాంటి బాధలు అనుభవించవలసి వస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఈ అనుభవాలను చూశారన్నారు.  ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్ఎస్ శివశంకర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని అన్ని వర్గాలు వికేంద్రీకరణ వాదాన్ని బలంగా వినిపించడానికి సిద్ధం కావాలన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం