ఇదేనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "పింగళి వెంకయ్య " ఇచ్చే గౌరవం..?
హైదరాబాద్, ఆగస్టు 2, టుడే న్యూస్: "ఆజాది కా అమృత్ మహోత్సవ్" దేశ స్వాతంత్ర వజ్రోత్సవాలని మొదలు పెట్టుకున్న ఈరోజు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వారైనా మన *పింగళి వెంకయ్య* జాతీయ జెండాని రూపకల్పన చేయడం జరిగింది. ఈరోజు ఆయన జయంతి వేడుక, దేశంలో తలమానికంగా భారతదేశానికి ఆదర్శంగా, మన జాతీయ జెండా ని రూపొందించిన వ్యక్తి పింగళి వెంకయ్య ,ఆయన ఏ మాత్రం కూడా ఆయన కోసం ఆలోచన చేయకుండా దేశం కోసం పాకుబడిన మహోన్నతమైన వ్యక్తి, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, పింగళి వెంకయ్య .. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ వైఖరి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. కెసిఆర్ , సిఎస్ సోమేశ్ కుమార్ , ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు ఈరోజు నుంచి అమృత్ ఉత్సవాలు చేస్తున్నామని ప్రకటించారు.మన హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్న పింగళి వెంకయ్య విగ్రహానికి ఈ రకమైన నిరాదరణకు గురి కావడం అనేది మనం సహించలేనిది.. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి నివాల్లు అర్పించకపోవడం దారుణం.. ఇది స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారికి అవమానం, ఇదేనా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పింగళి వెంకయ్య గారికి ఇచ్చే గౌరవం..?
ఆయన జయంతి వేడుకలు మరియు "ఆజాది కా అమృత్ మహోత్సవ్" ఉత్సవాలు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ ఈరోజు పింగళి వెంకయ్య గారికి కనీసం నివాళులర్పించలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం..ట్యాంక్ బండ్ వేదికగ జాతీయ జెండాలతో అలంకరణ చేస్తే బాగుండేది,కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా శ్రద్ద చూపడం లేదు.ఒక తెలుగువాడు రూపొందించిన జాతీయ జెండా రూపశిల్పి అయిన, పింగళి వెంకయ్య గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జయంతి వేడుకలు జరపకపోవడం చాలా బాధాకరం.ఈ రోజు సాయంత్రంలోగా ఇక్కడ జాతీయ జెండాలతో అలంకరించి పింగళి వెంకయ్య గారిని ఘనంగా నివాళులర్పించాలని కోరుకుంటున్నాము..