పోర్ట్ స్టేడియంను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వవద్దు - కేకే రాజు



 అక్కయ్యపాలెం, ఆగస్ట్ 1, టుడే న్యూస్: పోర్ట్  స్టేడియంను   ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వద్దని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త, నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.  విశాఖ నగరంలో ఇప్పటికే కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పోర్టు స్టేడియం ఉండటంతో ఇక్కడ ఉన్న పచ్చదనం వల్ల కాస్తయినా నగర ప్రజలు ఉపశమనం పొందుతున్నారని ఇది కూడా ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో పెడితే వారు వారియొక్క వ్యాపారాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న పచ్చదనాన్ని కూడా నాశనం చేయడమే కాకుండా సాధారణ ప్రజలకు ప్రవేశం కూడా ఉండదని ఆన్నారు.  ఇలా అయితే పోర్ట్ నుంచి వచ్చే వాయు కాలుష్యం నగర ప్రజలు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు.  కావున పోర్ట్ యాజమాన్యం మంచి మనసుతో ఆలోచించి యధావిధిగా కొనసాగించాలని కేకే రాజు  కోరారు. ఈ విషయమే  ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, పోర్టు చైర్మన్ గారికి తెలియజేయటం జరిగిందని అన్నారు. త్వరలో ఈ విషయాన్ని విశాఖ,అనకాపల్లి అల్లూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మరియు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి  గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయనున్నామని ఆయన అన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం