పాత్రికేయులపై ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి
విశాఖపట్నం, జూలై2,టుడే న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయులపై ఉన్న ఎస్టీ అట్రాసిటి కేసులను సునిశిత పరిశీలన జరిపి పరిష్కరించాలని కోరుతూ ఏపీ స్టేట్ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబుకు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ వినతి పత్రాన్ని అందజేసింది. ఈ మేరకు మద్దిలపాలెం కళాభారతి సమీపంలో ఉన్న ఆయన నివాసం వద్ద యూనియన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ డాక్టర్ హనుమంతు లక్ష్మణ్,
విశాఖ జిల్లా అధ్యక్షులు నేమాల హేమ సుందరరావు, ఉపాధ్యక్షులు సీపాన రామ్ ప్రసాద్ లు నేరుగా కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు మాట్లాడుతూ జిల్లాల వారీగా పోలీసులతో జరిపే సమీక్ష సమావేశాల్లో
ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.