వృథా పోతున్న నీటిని కాపాడి, ఖరీఫ్, రబీ పంటలు వేసుకునేలా రైతులకు భరోసా కలిగించాలి: టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బక్కని
హైదరాబాద్,జూలై21,టుడే న్యూస్: ఆదిలాబాద్ పార్లమెంట్ లోని నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ ని గత 15 రోజులుగా కురుస్తున్న అధిక వర్షల వల్ల దెబ్బతిన్న కడెం ప్రాజెక్ట్ ను టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బక్కని నర్సిములు సందర్శించి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ లకు కక్కుర్తి పడి కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తు పాత ప్రోజెక్టుల ను నిర్లక్ష్యం చేస్తూ కాలం గడుపుతున్నారు. అలాగే పోజెక్టు ముందు జగర్తలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ దుస్థితికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని అలాగే ప్రాజెక్ట్ పరిరక్షణకు సంబంధించిన అధికారులను పూర్తి స్థాయిలో నియమించి . వృథా పోతున్న నీటిని కాపాడి , ఖరీఫ్, రబీ పంటలు వేసుకునేలా రైతులకు భరోసా కలిగించాలి. అలాగే
అతి వృష్టి వల్ల పంట నష్టం పోయిన రైతులకు ఎకరాకు15వేల రూపాయలు, అలాగే పంట సాయం అందించాలి , ఎరువులు విత్తనాలు ప్రభుత్వమే ఉచితంగా అందించాలని బక్కని నర్సిములు అన్నారు. వీరితోపాటు గుళ్ళపల్లి ఆనంద్ ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు , ఐలయ్య యాదవ్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి , పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు వి.మోహన్, పెరుగు ఆత్మరాం, తాల్లపెళ్లి రాజేశ్వర్, ముధోల్ నియోజకవర్గ ఇంచార్జి బోయిడి విట్ఠల్ , రాష్ట్ర ఐటీడీపీ అధ్యక్షులు హరికృష్ణ, నిజామాబాద్ పార్టీ అధ్యక్షులు యదగౌడ్, జహీరాబాద్ పార్టీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి , నిర్మల్ నియోజకవర్గ త్రిమెన్ కమిటీ సభ్యులు సీదుగు భీమ్ రెడ్డి , పి.శ్రీకాంత్, పడిగెల నర్సయ్య, బైరి వెంకన్న, తెలుగు యువత నాయకులు శ్రీనివాస్, రాజు , జి.నాగన్న, తదితరులు పాల్గొన్నారు.