మద్యపాన నిషేధంపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ వింత వివరణ


విశాఖపట్నం,జూలై31,టుడే న్యూస్: మద్యపాన నిషేధంపై ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వింత వివరణ ఇచ్చారు.మద్య నిషేధం అనే మాటే చెప్పలేదని బుకాయించారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.''మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యం నిషేధిస్తాం. మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తాం'' ఇదీ వైకాపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నాలుగు లైన్ల వాగ్దానం. కానీ, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాత్రం మద్య నిషేధం అనే మాటే మా మేనిఫెస్టోలో లేదంటున్నారు. మేనిఫెస్టోలో మీరు ఈ మాట చెప్పారు.. చెప్పిన మాట ప్రకారం చేయలేదంటే ప్రశ్నించండి అని మీడియా ప్రతినిధులకు సవాల్‌ విసిరారు. మద్యం రేట్లు ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో కంటే ఎక్కువ పెడతాం, ఎవరైనా ముట్టుకోవాలంటే షాక్‌ కొట్టే పరిస్థితి తీసుకొస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా మా మేనిఫెస్టో గోడలపై ఉంటుంది.. వెళ్లి చూసుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు. అసలు ఎన్నికల ప్రణాళికలో ఏ ముందంటే?..

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం