రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభ అభినందనీయం : బిశ్వభూషణ్ హరిచందన్


రాజ్‌భవన్‌లో క్రీడాకారులను సత్కరించిన గవర్నర్

విజయవాడ, జూలై 1 టుడే న్యూస్: చారిత్రాత్మక విజయాలు సాధించిన వారి స్పూర్తితో రాష్ట్ర యువత క్రీడారంగంలో తమదైన ప్రతిభను ప్రదర్శించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కృషి ఉంటే సాధించలేనిది లేదని, సాధనతో అనుకున్న లక్ష్యాలను అందుకోగలుగుతారని పేర్కోన్నారు. విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక అభినందన కార్యక్రమంలో థామస్ కప్ చాంపియన్‌షిప్ సాధించిన భారత జట్టు బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, జి. కృష్ణ ప్రసాద్, డెఫ్లింపిక్స్ 2021 టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించిన జఫ్రీన్ షేక్‌లతో పాటు ఆసియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించిన ఎస్. చంద్రకళలను గవర్నర్ సత్కరించారు. 

ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ రాష్ట్ర క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్ధాయిలో మంత్రి ప్రతిభను కనబరుస్తున్నారని, అదే పరంపరను కొనసాగించాలని ఆకాంక్షించారు. మరిన్ని విజయాలను సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకు రావాలన్నారు. ప్రారంభోపన్యాసం చేసిన పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా యువజనాభ్యుద శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న క్రీడాకారులను అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్ధ నిర్వహణా సంచాలకులు ఎన్. ప్రభాకర్ రెడ్డి , రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ హరిచందన్ క్రీడాకారులకు జ్ఞాపిక, శాలువాను అందజేసి సత్కరించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్