*ఓవర్ బ్రిడ్జ్ వద్ద శ్రీనివాస సేతు పనులు పూర్తి చేయండి - కమిషనర్ అనుపమ అంజలి*
తిరుపతి శ్రీనివాస సేతు రెండవ దశలో ఓవర్ బ్రిడ్జ్ వద్ద జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. ఓవర్ బ్రిడ్జ్ వద్ద జరుగుతున్న శ్రీనివాస సేతు పనులను బుధవారం పరిశీలిస్తూ, పనులను చేపట్టిన అప్కాన్స్ ప్రతినిధులతో కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ తిరుపతి ఓవర్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలు మూసి వేయడంతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్థావిస్తూ పనులు నిలపకుండా నెల లోపు పూర్తి చేసేటట్లు చూడాలన్నారు. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయితే మేజర్ పనులు చాలా వరకు ముందుకెల్లినట్లెనన్నారు. ఈ పరిశీలనలో మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, అప్కాన్స్ ప్రతినిధి స్వామి పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు వద్ద సర్వేలు పూర్తి చేసి, రోడ్లకు అడ్డు వచ్చే నిర్మాణాలను మార్క్ చేయాలని, సర్వేయర్లు తమకిచ్చిన పనులు పూర్తి చేస్తే, ఇంజనీరింగ్ సిబ్బంది రోడ్లు నిర్మించే పనులు చేపడుతారని కమిషనర్ అనుపమ అంజలి మునిసిపల్ ప్లానింగ్ సిబ్బందికి సూచనలు జారి చేసారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో బుధవారం సమావేశమైన కమిషనర్ మాట్లాడుతూ నగరాభివృద్దికి మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లు షన్ముగం, బాలసుబ్రహ్మణ్యం, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్లు సాయిలీలా, శారదాంబ, బిల్డింగ్ ఇన్స్ పెక్టర్లు ధర్మరాజు, జగదీశ్వర్ రెడ్డి, సర్వేయర్లు దేవానంద్, మురళీకృష్ణలు పాల్గొన్నారు*