విపత్తును విదేశీ కుట్రనే స్థాయికి కేసీఆర్ దిగజారారని ఇలాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలోనే లేరని విమర్శించారు:టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్


హైదరాబాద్,జూలై17, భారీ వర్షాల వెనుక విదేశీయుల కుట్ర ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం  విచిత్రంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. గోదావరి  వరద ప్రభావిత ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్   సృష్టించినట్టు   ముఖ్యమంత్రి ఏ ఆధారంతో మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది .క్లౌడ్ బరస్ట్ పై ముఖ్యమంత్రి తమ దగ్గర ఉన్న సమాచారాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దేశం పై కుట్ర అని ముఖ్యమత్రి  స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఆషామాసి వ్యవహారం కాదని దీనిపై ఉన్నటువంటి ఆధారాలను కేంద్ర అత్యున్నతమైననిఘ సంస్థలకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వరద ప్రాంతాల ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కోసం హాస్యాస్పదమైన మాటలు మాట్లాడినట్లుగా అర్థమవుతుందని చెప్పారు . వరద బాధితులను పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోలేక ..

ఆడలేక మధ్యలో ఓడు అని.. తన వైపల్యాలను  కప్పిపుచ్చుకోవడం కోసం క్లౌడ్ బరస్ట్ విదేశీ కుట్ర అనే స్థాయికి దిగజారడాని విమర్శించారు ముఖ్యమంత్రి పర్యటనలో వరద బాధితులకు భరోసా ఇవ్వవలసిన పోయి భయం కల్పిస్తున్నాడని ఇలాంటి  వ్యాఖ్యలను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విపత్తును విదేశీ కుట్రనే స్థాయికి కేసీఆర్ దిగజారారని ఇలాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలోనే లేరని విమర్శించారు. నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు నిర్మించిన కరకట్ట వల్ల భద్రాచలం ప్రమాదం నుంచి బయటపడిందని అక్కడ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ  పాలాభిషేకం  చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కెసిఆర్ పర్యటనలో భద్రాచలంలో వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన వారిని అరెస్టు చేయడం పట్ల ఖండించారు .

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం