ఘనంగా అలిండియా బంజార సేమినార్
హైదరాబాద్,జూలై10,టుడే న్యూస్: విశ్వేశ్వర భవన్ హైదరాబాద్ నందు జరిగిన అలిండియా బంజార సేమినార్ లో తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యురోసభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ర్ట పార్టీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజు నాయక్, పాల్గోన్నారు. ఈ సందర్బంగా.... పోలిట్‌బ్యురోసభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి,మాట్లాడుతూ... స్వర్గీయ ఎన్టీఆర్ 4 శాతం ఉన్నా గిరిజన రిజర్వేషన్ ను 6 శాతం గా పెంచారని ప్రస్తుత గిరిజన జనాభా అనుగుణంగా 12 శాతం పెంచాలని దానికి అనుగునంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలిపారు.