ప్రజల ముందుకు క్రాస్ రోడ్ డిజిటల్ చానల్..హాజరైన ప్రముఖులు
హైదరాబాద్, జూన్30,టుడే న్యూస్: ఎలక్ట్రానిక్ మీడియా రోజు రోజుకు సరికొత్తగా ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో యూట్యబ్ చానల్స్ తమ సత్తా చాటుతూ విజయం బాటలో ప్రయాణిస్తున్నాయి. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేలా డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియా కొంగొత్త ఆలోచనలతో, మనసును హత్తుకునే పోగ్రాంలతో రోజు రోజుకు రేటింగ్ పెంచుకుంటూ రాకెట్ లా దూసుకువెల్లుతుంది. ఇదే బాటలో చేరడానికి సరికొత్త హంగులతో ప్రజల ముందుకు వచ్చింది క్రాస్ రోడ్ డిజిటల్ యూట్యబ్ చానల్.. కాగా నిన్న ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన క్రాస్ రోడ్ డిజిటల్ చానల్ లాంచింగ్ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ హీరో సుమన్,వేణుగోపాలచారి, బీసీ కమిషన్ ఛైర్మన్ వకులభారణం కృష్ణ మోహన్, మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ, బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, సింగర్ ప్రణయ్ మరియు ఈ చానల్ సీఈవో వినోద్ మొదలగు వారంత పాల్గోని క్రాస్ రోడ్ డిజిటల్ చానల్ ఆవిష్కరణను ఘనంగా నిర్వహించారు..
ఈ సందర్భంగా బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చిత్రాల్లో ముఖ్యంగా శ్రీ రాముడు, విష్ణుమూర్తి వంటి పాత్రలకు పెట్టిన పేరుగా అన్న ఎన్‌టీఅర్ ను చెప్పుకునే వారు. ఆ తర్వాతి స్దానాన్ని సుమన్ గారు భర్తి చేశారు. ఇక అన్నమయ్య చిత్రంలో సాక్షాత్తుగా ఆ విష్ణుమూర్తినే దర్శించిన అనుభూతు కలిగేలా సుమన్ గారు నటించడం మనందరికి తెలిసిందే. ఒక కరాటే మాస్టర్ గా జీవిత ప్రయాణాన్ని ఆరంభించి ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎదురైయ్యే ముళ్ల కంచెలను దాటుకుంటూ తన సినీ ప్రస్దానాని కొనసాగించిన సుమన్ గారు మాలాంటి వారెందరికో ఆదర్శం. అంతే కాదు మూడు డాక్టరెట్స్ పొందిన ఘనత మా సుమన్ అన్నగారిది అని పేర్కొన్నారు..
ఇకపోతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వెనుకబడిన కులాల అభివృద్ది కోసము ప్రతీ క్షణము తపిస్తూ వుంటున్న ప్రస్థత బీసీ కమిషన్ ఛైర్మన్ వకులభారణం కృష్ణ మోహన్ గారితో తో పాటుగా, ఒకప్పుడు మెలోడీ సంగీతంతో, పాటలతో కుర్రగారు హృదయాలను ఊర్రూతలూగించిన ఘంటాడి కృష్ణ గారు, మాజీ మంత్రి వేణుగోపాల చారి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమము ఇంత అద్బుతంగా జరగడానికి ప్రధాన కారకుడు సింగర్ ప్రణయ్ అని తెలియచేసాడు.. ఇకపోతే ప్రజాస్వామ్యంలో నాలుగవ స్థంభం మీడియా రంగం, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మీడియా రంగాన్ని నిర్బంధించడం అంటే సమాజాన్ని అంధకారంలోకి నెట్టి వేసినట్లు. కాబట్టి మీడియా రంగం గొప్పతనం అర్థం చేసుకోవాలని వెల్లడించారు. ఇక ఎక్కడో అమెరికాలో నివాసం ఉంటూ ఆర్థికంగా ఎదిగి, తనకు తోచినంతగా సమాజానికి మంచిచేయాలనే బలమైన సంకల్పబలంతో క్రాస్ రోడ్ అనే యూట్యూబ్ ఛానల్ ని స్దాపించిన వినోద్ కి ధన్యవాదాలు తెలియచేసారు బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి.. ఇక ఈ కార్యక్రమంలో డాక్టరేట్ పొందిన హీరో సుమన్ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.. నిన్న జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ యూట్యూబ్ చానల్ ఆవిష్కరణలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేణుగోపాలచారి, బీసీ కమిషన్ ఛైర్మన్ వకులభారణం కృష్ణ మోహన్, బీసీ దళ్ అధ్య్క్షక్షుడు దుండ్ర కుమారస్వామి, సింగర్ ప్రణయ్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.