54,55 వార్డులలో ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిన, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ : కె కె రాజు
అక్కయ్యపాలెం,జూలై24,టుడే న్యూస్: నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో బాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి 54,55 వార్డులు లబ్ధిదారులకు 54,55వార్డు కార్పొరేటర్లు చల్లా రజిని, ఈశ్వరరావు,కె.వి.యన్ శశికళ ఆధ్వర్యంలో 54వార్డు నలంద నగర్లో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె కె రాజు పాల్గొని ఆయన చేతుల మీదుగా పలువురికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో హామీ ఇచ్చినప్పటికీ హామీలు నెరవేర్చడంలో విఫలమై పేదవాడి సొంత ఇంటి కల కల గానే మిగిలిపోయిందని,2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల సాకారం చేసేందుకు ఈ ప్రభుత్వం కృషి చేసిందని ఆయన అన్నారు.ఈ 54,55 వార్డు లో 3500 ఇళ్ళ పట్టాలు, మంజూరైనవి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీడి పద్మావతి,కాయిత వెంకట లక్ష్మీ,రత్నాకర్,దుప్పలపూడి శ్రీనివాసరావు,చిరంజీవి,ఎర్రంశెట్టి శ్రీను,బాల,షేఖ్ బాబ్జి,జుంజూరు గోవింద్,సొండి సురేష్, రమణమ్మ,సంతోష్,కరుణ,లక్ష్మీ,జామి దాసు,శివప్రసాద్,యస్.వి.యం రెడ్డి,సారిపిల్లి జగదీశ్,దిలీప్,రమేష్,చందురెడ్డి తదితరులు పాల్గొన్నారు.