ప్రజా రవాణా ఉద్యోగులు ముఖ్యమంత్రి కి రుణపడి ఉండాలి

 

ప్రభుత్వ సలహాదారి : సజ్జల రామకృష్ణ రెడ్డ

అమరావతి, జూన్ 09 : ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉండాలి అని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. బుధవారం నాడు ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు పీఆర్సీ, ఫిక్సకేషన్ తదితర జి.ఓలు వచ్చిన నేపథ్యంలో వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, రాష్ట్ర కమిటీ సభ్యులు  సజ్జల రామకృష్ణ రెడ్డి ని శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా జి.ఓ లు ఇప్పించడం పట్ల ఫెడరేషన్ నాయకులు కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఫెడరేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వి.జయరావు, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు రవిబాబు, ఎ.వి.వి.సత్యనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.కె.హాబీబ్, ఉమ్మడి కృష్ణ రీజియన్ కార్యదర్శి సుబ్బారావు, నాయకులు కె.శివ, ఎం.ఎ.నాయుడు తదితరులతో పాటు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం