వైభవంగా పైడితమ్మ పండుగ
* సారె దామర్పించిన ఈవో సూర్యకళ
* మొక్కులు తీర్చుకున్న భక్తులు
సింహాచలం, జూన్ 7, టుడే న్యూస్: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి సోదరిగా ఏడుగ్రామాల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లమ్మ వారి వార్షిక పండుగ మంగళవారం వైభంగా జరిగింది. రెండు సంవత్సరాల విరామం తరువాత పండుగ జరుగుతున్న నేపథ్యంలో భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ఈవో ఎంవి.సూర్యకళ, ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు బృందం వేద పండితుల మంత్రోచ్చారణలు, నాదస్వర వాయిద్యాల నడుమ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర,రవిక సారె సమర్పించారు. ఆర్చక స్వాములు, లండ వంశీయులు పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. గ్రామ సంప్రదాయం ప్రకారం పాత అడివివరం వద్ద తోలేళ్ల వేడుక జరిగింది. పూజారుల వంశీయులు, భక్తులు పూల ( అంజలి ) రథంలో ఉత్సవం జరిపించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అప్పన్న దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు , జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి,విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.కార్పొరేటర్ పిసిని వరహానరసింహం, మాజీ శాసనసభ్యుడు కర్రి సీతారాం, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీదేవి, శ్రీదేవి వర్మ, రామలక్ష్మి , అడివివరం సహకార పరపతి సంఘం అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, మాజీ సర్పంచ్ పాసర్ల ప్రసాద్, లండ వెంకటరమణ, కొలుసు ఈశ్వరావు, కర్రి సత్తిబాబు, అమ్మవారిని దర్శించుకున్నారు. ఏ ఈవో ఇజ్జురోతు శ్రీనివాసరావు, ఆనందకుమార్, ఈఈ శ్రీనివాసరాజు, డీఈ రాంబాబు ఉత్సవాన్ని పర్యవేక్షించారు.
సేవలు
గణేశ్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో చక్కర పొంగలి,
రస్నాలు పంపిణీ చేశారు... ధర్మకర్తల మండలి సభ్యులు
ప్రారంబించారు.. గౌరి కళ్యాణ మంటపం తరపున ప్రసాదాలు.. మజ్జిగ పంపిణి చేశారు.. ఈ స్టాల్ ను అప్పన్న దర్మకర్తల మండలి సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్లశ్రీను బాబు ప్రారంబించారు.