జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరుకై విజయసాయిరెడ్డి హామీ
విశాఖపట్నం, జూన్ 23,టుడే న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.
జగన్మోహన్ రెడ్డి సంసిద్ధంగా ఉన్నారని వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి చెప్పారు గురువారం ఉదయం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు
వచ్చిన విజయసాయిరెడ్డిని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మహా విశాఖ నగర శాఖ అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్,ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ నగర శాఖ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావులు కలిసి జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులను విజయసాయిరెడ్డికి వివరించారు. ముఖ్యంగా అల్పాదాయ వర్గాల మాదిరిగానే ప్రభుత్వం ప్రతీ జర్నలిస్టుకు కనీసం మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని కోరారు.జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను పలు ప్రైవేటు ఆసుపత్రులు అనుమతించనందున ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తగు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని అదేవిధంగా పొరుగు రాష్ట్రాల మాదిరిగానే జర్నలిస్టులకు పింఛను పథకం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు..వృత్తిపరంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఇందుకు సంబంధించి ఆటాక్స్ కమిటీలను నియమించాలని పేర్కొన్నారు.ఇందుకు విజయసాయిరెడ్డి సానుకూలంగా స్పందించి ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచనని ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు ఈ సందర్బంగా విజయసాయిరెడ్డిని శ్రీనుబాబు, నారాయణ్, ఈశ్వరరావులు ఘనంగా సత్కరించారు.