చంద్రబాబు పర్యటనలతో పార్టీకి పూర్వ వైభవం: చండీప్రియ
ఇండియాటుడే సర్వేతో పాలకుల ఆందోళన
తెలుగుమహిళ చండీప్రియ
రాజమండ్రి, జూన్, 15:
తెలుగుదేశం అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభంతో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం
ఆరంభం కాబోతోందని తెలుగుమహిళ నగర అధ్యక్షురాలు శ్రీమతి కోసూరి చండీప్రియ ప్రకటించారు. ఇండియాటుడే సర్వేలో వైఎస్సార్ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి ఊహించనిరీతిలో పెరగడంతో పాలకులలో ఆందోళన మొదలైందని ఆమె వెల్లడించారు. ఈ
నేపధ్యంలో చంద్రబాబు ప్రజలను మరింతగా చైతన్యం చేయబోతున్నారని చండీప్రియబుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. చంద్రబాబు నాయుడి జిల్లాల పర్యటన బుధవారం అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రారంభం అవుతున్న నేపధ్యంలో చండీప్రియ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ' ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా ' పేరుతో ఆరంభమవుతున్న చంద్రబాబు పర్యటనలను ప్రజలంతా దిగ్విజయం చేయాలని ఆమె కోరారు. హంతకులకు, దౌర్జన్యకారులకు, ముష్కరులకు మద్దతుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై చాప క్రింద నీరులా వ్యతిరేకత పెరిగిపోయిందని చండీప్రియ వెల్లడించారు. చంద్రబాబు పర్యటనల ద్వారా ప్రజలంతా మరింతగా రాష్ట్ర అస్తవ్యస్త పాలనా పరాకాష్ఠ ను తెలుసుకోవాలని
ఆమె కోరారు.