అరాచక పాలనను తిప్పికొట్టాలి
విశాఖపట్నం,జూన్10,శుక్రవారం,టుడే న్యూస్: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజావేదిక కూల్చివేత ద్వారా అరాచక పాలనకు నాంది పలికారని విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణు కుమార్ రాజు ఆరోపించారు.
ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేస్తూ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి కడుపునిండా తిండి పెట్టలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను మట్టుపెట్టాలని విమర్శించారు. అన్న క్యాంటీన్ ల ద్వార పేద ప్రజలకు రోజువారి కూలీలకు ఉదయం అల్పాహారం తో పాటుగా 5 రూపాయలకే భోజన సదుపాయం ఉండేదని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి పేదవాడు కడుపునిండా తిండి తినే వాడిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు చర్య వల్ల ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళగిరి వద్ద ఏర్పాటుచేసిన ఉచిత భోజన సౌకర్యాన్ని అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని దుయ్యబట్టారు. మీరు పెట్టారు - పెట్టే వారిని పెట్టనివ్వరు అంటు ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం వైసిపి అరాచక పాలనను ప్రజలు నిశ్చింతగా పరిశీలిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆ రోజు దగ్గరలోనే ఉందని అన్నారు.