వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబును ,ఘనంగా సన్మానించిన ముస్లిం సోదరులు

అక్కయ్య పాలెం,జూన్ 22,టుడే న్యూస్:

ప్రజా సేవయే పరమావధిగా భావిస్తూ ముందుకు సాగుతున్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అభినందనీయులని నగరానికి చెందిన పలువురు ముస్లిం సోదరులు కొనియాడారు.. తాజాగా బీచ్ రోడ్ లో ఒక కుటుంబానికి శ్రీనుబాబు తన వంతు  సహాయం అందించారు.. దీంతో నగరంలోని ముస్లిం సంఘాలకు చెందిన పలువురు నేతలు బుధవారము శ్రీను బాబును అక్కయ్య పాలెంలోని ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకొని ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ లాభాపేక్ష తో సంబంధం లేకుండా   తన పరిధి మేరకు సాయం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.. భవిష్యత్తులో కూడా తాను ఇదే మాదిరిగా సేవలు కొనసాగిస్తానన్నారు. తాను చిన్న పాటి సాయం చేసినప్పటికీ అదీ గుర్తు పెట్టుకొని వచ్చి తనను  సత్కరించడం సంతోష దాయకం అన్నారు. వారందరికీ శ్రీనుబాబు  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం