హైదరాబాద్:రిటైర్డ్ IAS అధికారి లక్ష్మి పార్థ సారథి కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు .
సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే
విశాఖపట్నం,2024, మే 10, టుడే న్యూస్: ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీలక్ష్మి వరాహనృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి, అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని, స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత. ‘యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం’ అంటే అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణుసాన్నిధ్యం కలుగుతుందని అర్థం. ఇదియే అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరపిస్తారు. ఈరోజు చేసే జప,తప,హోమ,తర్పనాదులు అక్షయమై పుణ్యఫలానిస్తాయని, అక్షయ తృతీయ బుధవారం, రోహిణి నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలమని అంటారు. కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రాక్షస రాజులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల క్రూరస్వభావం ముల్లోకాలను గడగడలాడించింది. హిరణ్యాక...