*డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలి - అఖిల భారత అంబేడ్కర్ యువజన సంఘం డిమాండ్*


కోనసీమ జిల్లాను డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గా పేరు మార్చడం పట్ల కొందరు వ్యతిరేఖించడాన్ని తప్పుబడుతూ అఖిల భారత అంబేడ్కర్ యువజన సంఘం, వడమలపేట మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు నాగరాజు గారు మాట్లాడుతూ  అంబేడ్కర్ గారి పేరును జిల్లాకు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న ఈ కులోన్మాధులపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, స్వాతంత్య్రం సమకూరి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇలాంటి కుల దురహంకార చర్యలకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు.

 సంఘం జిల్లా కార్యదర్శి సోడెం కిషోర్ మాట్లాడుతూ అంబేడ్కర్ గారి పట్ల అవగాహన లేని కొంతమంది అల్లరి మూఖలు చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలను తప్పుబట్టారు. 

జిల్లా సమన్వయకర్త డాక్టర్ డేవిడ్ గారు మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు, కానియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

వడమాలపేట మండల అధ్యక్షులు కాకి వెంకటేష్ గారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతను ఇలా కుల దురహంకారం తో అవమానించడం కడు శోచనీయమని అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ గారి పేరును యధాతధంగా గా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

........

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం