జిల్లాలో ఎన్.సి.డి సర్వే త్వరగా పూర్తి చేయండి : జిల్లా కలెక్టర్


తిరుపతి, మే 26:  జిల్లాలో  సంక్రమించని వ్యాధుల గుర్తింపు (ఎన్.సి.డి)  సర్వే త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి వైద్యాదికారులను ఆదేశించారు. గురువారం ఉదయం అమరావతి నుండి కోవిడ్ వ్యాక్సినేషన్, బయోమెట్రిక్ అమలు, ఎన్.సి.డి సర్వే, అందుబాటులో ఉన్న మందుల వివరాలు వంటి  వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి  కృష్ణ బాబు, డి.ఎం.ఈ రాఘవేంద్రరావు, హైమవతి లు అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలేక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, వైద్య అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లోని సూచనలు మేరకు జిల్లా కలెక్టర్  జిల్లా వైద్య అధికారులతో సమావేశమై వ్యాక్సినేషన్ 60+ వారిని, 12-14 వయస్సు వారిని త్వరగా గుర్తించి ఉపయోగాలను వివరించి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అసంక్రమిత వ్యాధులు అయినటువంటి డయాబెటిస్, ఆస్తమా,ఆల్జీమర్స్ , కిడ్ని,లంగ్ డిసిజెస్ గుర్తింపు కోసం జరుగుతున్న ఎన్.సి.డి సర్వే జిల్లాలో 60 శాతం మాత్రమే పూర్తయ్యిందని, సచివాలయ సిబ్బంది సహకారంతో వేగవంతం చేసి కనీసం 90 శాతం దాటేల చూడాలని ఆదేశించారు.  ఆసుపత్రులకు సంబంధించి మహా ప్రస్తానం, అంబులెన్సులు, హౌస్ కీపింగ్ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసారు. వైద్య శాఖకు సంబందించిన బయో మెట్రిక్ హాజరు కనీసం 92 శాతం దాటాల్సి ఉంటుందని అప్పుడే వైద్య చికిత్సలో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. యాంటి మలేరియా యాక్టివిటీ పై దృష్టి పెట్టాలని వైద్య అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో డి.ఎం.హెచ్.ఓ శ్రీహరి, రుయా సూపరింటెండెంట్  భారతి,ఎస్.వి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థసారధి రెడ్డి, డి.పి.ఎం.ఓ శ్రీనివాసులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం