*జాయింట్ కలెక్టర్ల సేవలు మరువలేనివి*


"జిల్లా కలెక్టర్ డా. ఏ మల్లికార్జున"

విశాఖపట్నం, ఏప్రిల్ 3,టుడే న్యూస్:  జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాల రెడ్డి, పి. అరుణ్ బాబు, కల్పనా కుమారి విశాఖపట్నం జిల్లాకు అందజేసిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ డా.ఏ. మల్లికార్జున కొనియాడారు.  ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నుండి బదిలీపై వెళ్తున్న ముగ్గురు జెసి లకు ఏర్పాటు చేసిన వీడ్కోలు, సన్మాన సభలో ఆయన  మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో తనకు ఎంతో సహాయకారిగా పని చేశారని ప్రశంసించారు. ప్రముఖుల పర్యటనల సమయాలలో చేదోడుగా నిలిచారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలని ఎప్పటికైనా  బదిలీలు సహజమని పేర్కొన్నారు.  ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు సహజమన్నారు. డి ఆర్ వో శ్రీనివాస మూర్తి, ఎస్ డి సి రంగయ్య, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రమణమూర్తి తదితరులు జెసి లతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి సేవలను కొనియాడారు. విశాఖపట్నం జిల్లా నుండి బదిలీ అయిన ఆర్డీవోలు కె.పెంచల కిషోర్, జె.సీతారామారావు, డి.ఆర్.డి.ఏ. పి.డి. వి.విశ్వేశ్వరరావు, ఎస్.డి.సి. కె.హేమలత లను కూడా సన్మానించారు.  కొత్తగా వస్తున్న జేసీలకు ఆహ్వానం పలికారు. జేసీలు జిల్లాతో తమకు గల అనుబంధాన్ని,  అనుభవాలను చెబుతూ తమకు సహకరించిన జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముగ్గురు జేసీలను సన్మానించి మెమొంటోలు అందజేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్