*చిత్తూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో గౌ.రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన శాఖ మంత్రి కి ఘన స్వాగతం*


చిత్తూరు,ఏప్రిల్ 19,టుడే న్యూస్: గౌ.రాష్ట్ర పర్యాటక, సాంస్కృ తిక యువ జన శాఖ మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఆర్ .కె.రోజా గారు మంగళవారం సాయంత్రం మంత్రి గా తొలిసారి చిత్తూ రు జిల్లా కేంద్రం  నకు  విచ్చేయగా..చిత్తూరు ఆర్ & బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్,జిల్లా ఎస్. పి రిషాంత్ రెడ్డి,

జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్,డి ఆర్ ఓ రాజ శేఖర్, తదితరులు ఘన స్వాగతం పలి కారు...

అనంతరం జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తో కలసి అధికారులతో సమావేశం కాగా... కొత్త గా ఏర్పాటు అయిన చిత్తూరు జిల్లా నై సర్గిక స్వరూపం, భౌగోళిక విస్తీర్ణం, 7 రెవెన్యూ డివిజన్లు, జిల్లా పరిషత్,శాఖ ల పనితీరు, నాడు- నేడు,ఎన్ ఆర్ ఈ జి ఎస్,హౌసింగ్, నవ రత్నాలు అమలు తీరు ను జిల్లా కలెక్టర్ వారు మంత్రి కి వివరించారు...

అనంతరం జడ్పీ సి ఈఓ ప్రభాకర్ రెడ్డి, డిపి ఓ దశరథ రామి రెడ్డి, ఎపి టి డి సి మే నేజర్ గిరిధర్ రెడ్డి,

నగరి ఆర్ డి ఓ సృజన,సెట్విన్ సీఈఓ మురళీ కృష్ణ,  టూరిజం ఆఫీసర్ ఉమాపతి లు వారి వారి శాఖల వారీగా పథకాల అమలు పనితీరు ను మంత్రి కి వివరించారు.  ఈ సందర్భంగా గౌ.రాష్ట్ర పర్యాటక, సాంస్కృ తిక యువ జన శాఖ మంత్రి మాట్లాడుతూ పర్యాటక శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా ప్రతినిధుల సహ కారంతో రాష్ట్ర వ్యాప్తంగా  టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడతామని దీనితో పాటు క్రీడల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు...

టూరిజం వైపు ప్రపంచమంతా ఆసక్తి చూపుతోందని ఏపీలో టూరిజం లో భాగంగా వాటర్ ఫాల్స్ ,దేవాలయాలతో అనుసంధానం చేసుకొని టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు క్రీడల ద్వారా ఆరోగ్యంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చని పిల్లలకు చదువు తోపాటు క్రీడల్లో కూడా ఆసక్తిని పెంపొందించుకునే విధంగా తల్లి దండ్రులు పిల్లలకు అవగాహన   పెం చాలని గ్రామీణ క్రీడ లను పెంపొందించే దిశగా కృషి చేస్తా మని.. యువత ఉపాధి దిశగా మరియు చక్కటి పౌరులుగా యువత ను తీర్చిదిద్దేందుకు కాలేజీలో కార్య క్రమాల నిర్వహణ తో పాటు జాబ్ మేళా లో నిర్వహిస్తూ శాఖా పరంగా చర్యలు చేపడతామని తెలిపారు . రాష్ట్రవ్యాప్తంగా నా శాఖాపరంగా అభివృద్ధికి గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని ఎక్కువ మందికి సేవ చేసేం దుకు ఈ అవ కాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలే నని, చిత్తూరు, తిరుపతి జిల్లాల ఆడబిడ్డగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్ డి ఓ రేణుక, నగరి ముని సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్, సెట్విన్అసిస్టెంట్ మేనేజర్ మోహన్ కుమార్ సంబంధింత అధికారులు పాల్గొన్నారు...



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్