గంగనాపల్లి నివాసికి గిన్నిస్ బుక్ లో చోటు..


 


అబ్దుల్ రహీమ్ ను అభినందించిన ఎమ్మెల్యే కన్నబాబు..

పజిల్ క్యూబ్ ఆటలో గెలుపొందిన అబ్దుల్..

 కాకినాడ రూరల్, గంగనాపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ షా అబ్దుల్ రహీం గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. ఫజిల్ క్యూబ్ ఆటలో ఆన్లైన్ ద్వారా జరిగిన పోటీలో సుమారు 240 మంది పాల్గొనగా  20 మంది కేవలం 50 సెకండ్ల లోపు విజయం సాధించారు.  రాష్ట్రంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న గంగనాపల్లి గ్రామం కి చెందిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ విజయం సాధించారు. ఈ సందర్భంగా వైకాపా నియోజకవర్గ యువజన అధ్యక్షుడు గిశాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సయ్యద్ తల్లిదండ్రులతో ఎమ్మెల్యే కన్నబాబు ను తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కన్నబాబు సయ్యద్ కు మెడల్ వేసి, గ్రామానికి ఎంతో పేరు తీసుకొచ్చిన  వైసీపీ లీడర్  గిశాల శ్రీనివాసరావుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు  లీలా కృష్ణ, రాయ్, అలిపిరాల శ్రీనివాస రావు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్