ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణి చేసిన: కె.కె రాజు
విశాఖ ఉత్తర నియోజకవర్గం కార్యలయంలో లబ్ది దారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు గురువారం పంపిణీ చేసారు . ఈమేరకు నియోజకవర్గం పరిథిలో 22 మంది లబ్ది దారులకు 7 లక్షల 30 వేల రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసారు.
ఈసందర్బంగా ఆయన మాట్లడుతూ ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి వర్యులు గౌ" శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య శ్రీ ద్వార వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్య శ్రీ పరిధిలో లేని అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహయం అందించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు,స్టాండింగ్ కమిటీ మెంబర్లు వి.ప్రసాద్,శశికళ, కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు,సాడి పద్మారెడ్డి,ఆళ్ళ లీలావతి&శ్రీనివాసరావు,కె.కామేశ్వరి,రెయ్యి వెంకటరమణ,చల్లా రజిని,వార్డు అధ్యక్షులు నీలి రవి,పైడి రమణ,మాజీ కార్పొరేటర్లు బాక్సర్ రాజు,బులుసు జగదీష్,డైరెక్టర్లు రాయుడు శ్రీను,సీనియర్ నాయకులు కె.చిన్నా,వసంతల అప్పారావు,కె.సుశీల తదితరులు పాల్గొన్నారు.