పెందుర్తి ఏ సి పి కే వెంకట కృష్ణారావు సస్పెన్షన్
విశాఖపట్టణము, ఫిబ్రవరి 11 టుడే న్యూస్: పెందుర్తి ఏసీపీ కె వెంకటకృష్ణా రావును శుక్రవారము జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి లక్ష్మిసా సస్పెండ్ చేశారు. చిన్నముసిడివాడ సుజాతనగర్ లోని టీచర్స్ కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లేఔట్ లో గల ఓపెన్ స్పేస్ ను ప్రారంభదశలో 2012లో రిజర్వుడు ఓపెన్ స్పేస్ జీవీఎంసీ పేరున రిజిస్టర్ చేశారని, తదుపరి 2021లో నగరపాలక సంస్థకు రిజర్వ్ ఓపెన్ స్పేస్ కోలతల కంటే ఎక్కువ స్థలం ఇచ్చి ఉన్నామనీ తిరిగి కొలతలు వేసి రిజిస్టర్ డాక్యుమెంట్ ప్రకారము తీసుకోవలసినదిగాకోరారు. దానికి ఏ సి పి కే వి కృష్ణారావు టౌన్ ప్లానింగ్ సర్వేయర్ చేత సర్వే చేయించి ఉన్నత అధికారులు అయిన కమిషనర్ గాని సి సి పి కి గాని జోనల్ కమిషనర్ కి గాని తెలపకుండా సొసైటీ వారితో వేరు వేరు కొలతలతో, వేరు వేరు హద్దులతో 2021లో రిజిస్ట్రేషన్ చేయించి నగరపాలక సంస్థకు నష్టం వాటిల్లే టట్లుగా మరియు సొసైటీ వారికి లాభం జరిగేటట్లు గా చేశారని. ఈ విషయముపై కమీషనరు ఎంక్వైరీ చేయించగా అభియోగాలు రుజువు అయినందున సదరు ఏసిపి కే వెంకట కృష్ణారావు ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేశారు.