ఎం.ఎల్.సి ఎన్నికల నిర్వహణకు తయారుగా వున్నాం - జిల్లా కలెక్టర్ డా.ఏ. మల్లికార్జున

 


విశాఖపట్నం, నవంబర్ 10, టుడే న్యూస్: జిల్లాలో జరుగబోయే స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికల

నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ. మల్లికార్జున తెలిపారు.

స్థానిక సంస్థల ఎంఎల్సి ఎన్నికల పై బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్

సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ,

ప్రవర్తనా నియమావళి, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ, తుది

జాబితా వెల్లడి , పోలింగ్ , కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సిబ్బంది నియామకం, నామినే

షన్ల స్వీకరణ, ఉప సంహరణ తదితర అంశాల పై కలెక్టర్ లకు, ఎన్నికల రిటర్నింగ్

అధికారులకు పలు దిశానిర్దేశం చేసారు. కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని బహిరంగ సమావేశాలకు

అనిమతించరాదని, శాంతిభద్రతలు, చెక్ పోస్ట్ ల నిఘా, ఇతర ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా

జరిగేల చూడాలని జిల్లా ఎస్.పి లకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో ఎన్నికల ఏర్పాట్ల

పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున మాట్లాడుతూ జిల్లా లో స్థానిక

సంస్థలకు సంబంధించి రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నట్లు తెలపారు. ఎన్నికల

సన్నద్దత, చేపట్టిన చర్యలను వివరించారు.   

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ బాలట్ పత్రాల

ముద్రణ, , ఇతర ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి

కోవిడ్ వాక్సిన్ తప్పనిసరిగా రెండు డోసులు వేయాలన్నారు. ఈ నెల 9 వ తేదీ నుండే ఎన్నికల

ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరు నిబంధనలను పాటించాలన్నారు.

ఈ సమావేశం లో ఎం ఎల్ సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంయుక్త కలెక్టర్

ఎమ్.వేణుగోపాలరెడ్డి, జివియంసి కమిషనరు లక్ష్మిశ, జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాసమూర్తి,

జిల్లాపరిషత్ సిఈవో నాగార్జున సాగర్, నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్లు,

ఎన్నికల సెక్షన్ డి.టి. రవికుమార్, జిల్లాలోని ఎన్నికల డి.టి.లు తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం