భాకరాపేట ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు.
బస్సు డ్రైవర్ కి తీవ్రగాయాలు, 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు.
చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండల పరిధిలోని తిరుపతి, మదనపల్లె జాతీయ రహదారిలో భాకరాపేట ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి తీవ్ర గాయాలు కాగా, అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మదనపల్లె డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కర్నాటక రాష్ట్రం, బళ్ళారి నుండి తిరుపతి వస్తుండగా శనివారం అర్ద రాత్రి భాకరాపేట ఘాట్ రోడ్డులోకి రాగానే బస్సు డ్రైవర్ గంగాధరంకు గుండె పోటు వచ్చింది దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ గంగాధరంకు తీవ్ర గాయాలు కాగా అందులోని 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.