*ఏపీఈపీడీసీఎల్ ఇన్ ఛార్జి సీఎండీగా కె రాజబాపయ్య బాధ్యతల స్వీకరణ*
విశాఖపట్నం, జూన్ 07: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఇన్ ఛార్జి సీఎండీగా సంస్థ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కె రాజబాపయ్య కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎండీగా ఉన్న ఎస్. నాగలక్ష్మి పదోన్నతిపై అనంతపురం కలెక్టరుగా బదిలీ కావడంతో ప్రాజెక్ట్స్ డైరెక్టర్ గా ఉన్న కె రాజబాపయ్యకు సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఇంధన శాఖ సెక్రటరీ ఎన్. శ్రీకాంత్ శనివారం ఉత్తర్వులు జారీ చేసారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన రాజబాపయ్యకు డైరెక్టర్లు బి రమేష్ ప్రసాద్, డి చంద్రం, సీజీఎంలు పివివి సత్యనారాయణ, ఓ సింహాద్రి, జి శరత్ కుమార్, ఎన్ గంగాధర్, కెవిసిహెచ్ పంతులు, ఏ వెంకటేశ్వరరావు, సి శ్రీనివాసమూర్తి, డి సత్యనారాయణ, కార్పొరేట్ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.