ప్రశాంత్ కిషోర్ ఐడియా నేతల తలరాతలు మార్చేస్తుంది
టుడే న్యూస్: దేశ రాజకీయాల్లో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోతోంది .గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి విశేష కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ తాజాగా పశ్చిమ బెంగాల్ ,తమిళ నాడు ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ ,డీఎంకేకు వ్యూహకర్త గా పనిచేసి ఘన విజయం సాధించారు .ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిఫార్సు మేరకు ప్రశాంత్ కిషోర్ తమిళనాడు డీఎంకే పార్టీ విజయానికి వ్యూహకర్తగా పని చేసినట్లు ప్రచారం జరుగుతోంది .పశ్చిమబెంగాల్లో బిజెపి గెలుపు ఖాయమని జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్ చేస్తూ బిజెపికి డబల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు వస్తే తాను ఫేస్ బుక్ ,ట్విట్టర్ అకౌంట్లా నుంచి తాను మళ్లీ కనిపించని సవాల్ చేశారు .ఆచరణలోనూ బీజేపీని పశ్చిమబెంగాల్లో డబల్ డిజిట్ కు పరిమితం చేశారు