ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని అన్ని వర్గాల వారు అభినందిస్తున్నారు.
ముఖ్యమంత్రి కి కృతజ్ఞత లు
ఓసి కులాలు లో ఉన్న వారి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ఓసి వెల్ఫేర్ ఫెడరేషన్ తరుపున చైర్మన్ బుద్ధరాజు శివాజీ ప్రధాన కార్యదర్శి ఇ వి వెంకట రామారావు, ఉపాధ్యక్షుడు వీరరాఘవరెడ్డి తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఓ సి ల లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక భరోసా ఏర్పడుతుందని తాము నమ్ముతామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని అన్ని వర్గాల వారు అభినందిస్తున్నారు. కార్పొరేషన్లకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు నిధులు విడుదల చేసి వారి జీవితాలలో వెలుగు నింపుతుంది అందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు .కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లో అమలు జరిగితే ఓ సి లలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగ రంగాలలో అవకాశాలు లభిస్తాయని వారు అన్నారు. ఈ రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఎస్ టి, ఎస్సీ,బి సి సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి హక్కులకు భంగం కలగకుండా ఉంటుందని శివాజీ అన్నారు. కావున ముఖ్యమంత్రి ఈడబ్ల్యూఎస్ నో మన రాష్ట్రంలో అమలు చేయవలసిందిగా వినయ పూర్వకంగా అభ్యర్థిస్తున్నాము అని వారు తెలిపారు.