మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత



విశాఖపట్నం,టుడేన్యూస్ : మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. 15 రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. ఈ నెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు. మూడో రోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అనంతరం వైద్యుల సలహామేరకు ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.  వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం