కేజ్రివాల్ నిజం మాట్లాడు: సింగపూర్ మంత్రి

 

న్యూఢిల్లీ: సింగపూర్‌లో ప్రమాదకరమైన కొవిడ్-19 వేరియంట్ ఉందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌పై సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ ట్విట్టర్ ద్వారానే స్పందించారు. కేజ్రివాల్ యథార్థాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ‘రాజకీయ నేతలు యథార్థాలకు కట్టుబడి ఉండాలి. ‘సింగపూర్ వేరియంట్’ అనేదేమీ లేదు’ అని బాలకృష్ణన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అంతకుముందు కేజ్రీవాల్ ఇచ్చిన ట్వీట్‌లో సింగపూర్‌లో కొత్త కొవిడ్-19 వేరియంట్ వ్యాపిస్తోందని, ఇది చాలా ప్రమాదకరమైనదని, దీనివల్ల చిన్న పిల్లలకు అపాయమని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో కొవిడ్ మూడో ప్రభంజనం రావచ్చునని హెచ్చరించారు. తక్షణమే సింగపూర్‌నకు విమానాల రాకపోకలను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం