మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్... కారు జోరులో కొట్టుకుపోయిన విపక్షాలు

వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో అధికారి టీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రతిపక్షాలు టీఆర్ఎస్‌కు ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయాయి.

Image

ప్రధానాంశాలు:

  • మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు
  • అన్ని చోట్ల విజయకేతనం
  • కారు జోరులో కొట్టుకుపోయిన విపక్షాలు      
  • నాగార్జున సాగర్ ఉప‌ఎన్నికల్లో విజయం సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్న టీఆర్ఎస్‌కు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. రెండు కార్పోరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లను భారీ మెజార్టీతో సొంతం చేసుకున్న అధికార పార్టీ.. ఐదు మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటింది. 
గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌లో ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించింది. స్వతంత్రులు మూడుచోట్ల గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 55 డివిజన్లు ఉండగా 45 డివిజన్‌లలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్‌‌ను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు.
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్  సొంతం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, టీఆర్ఎస్ రెబల్స్ ఆరుగురు గెలిచారు. వీరంతా రేపోమాపో టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది. దీంతో టీఆర్‌ఎస్‌ సంఖ్య పెరగనుంది.  
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో టీఆర్ఎస్ 7 స్థానాలు సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ 5 డివిజన్లలో గెలిచింది. నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో 20 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 13 సొంతం చేసుకుని ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ 6, బీజేపీ 1 గెలుచుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ భారీగా డివిజన్లు సొంతం చేసుకుంది. మొత్తం 27 డివిజన్లు ఉండగా వాటిలో 23 టీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ 2, బీజేపీ 2 సీట్లతో సరిపెట్టుకున్నాయి.
సిద్దిపేట మున్సిపాలిటీలోని 43 స్థానాల్లో టీఆర్ఎస్ ఏకంగా 36 చోట్ల విజయం సాధించింది. బీజేపీ, ఎంఐఎం ఒక్కో సీటు గెలవగా, ఇతరులు 5 డివిజన్లలో గెలిచారు. వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది. మంత్రి హరీశ్‌రావు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని టీఆర్ఎస్‌కు తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టారు. సిద్దిపేటలో వీచిన గాలి చూసి టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని అంతా భావించారు. అయితే ఆ అవకాశం కొద్దిలో మిస్ అయింది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం