*రాష్ట్రంలో కోవిడ్–19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.*
అమరావతి:
*ఆటోలు, సిటీబసులు 12.00గంటల వరకు మాత్రమే.!!*
రోడ్డుపై తిరిగితే సీజ్ చెయ్యాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.
కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైఎస్ జగన్ పలు అంశాలపై చర్చించిన మీదట పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గించడం, బెడ్‌ల కొరత నివారించేందుకు అవసరమైన చర్యలపై సీఎం చర్చించినట్టు తెలుస్తోంది.
ఎల్లుండి (బుధవారం) నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. పాక్షిక కర్ఫ్యూ బుధవారం నుంచి అమలు కానుంది.
ఉదయం 6.00గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు అన్ని షాపులు తెరిచి ఉంటాయని తెలిపారు.
12.00గంటల తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అమల్లో ఉండనున్నాయి.
రెండు వారాల పాటు ఆంక్షలను అమలు చేయనున్నారు.
ఉదయం 6.00గంటల నుంచి మధ్యాహ్నం 12.00వరకు అన్ని షాపులు తెరుచుకునే అవకాశం ఉంది.
*ఆ సమయంలో 144వ సెక్షన్ అమలులో ఉండనుంది.*