మెగా జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరణ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో , ప్రగతి భారత్ పౌండేషన్ సహకారంతో ఈనెల 24 ,25 తేదిలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో కె కె రాజు ఆధ్వర్యంలో జరిగినది. ఈ సందర్భంగా కె కె.రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు విజయసాయి రెడ్డి మరియు ప్రగతి భారత్ పౌండేషన్ సహకారంతో ఈ నెల 24 25 తేదీలలో విశాఖపట్నం లో మెగా జాబ్ మేళా నిర్వహించి సుమారు 4000 మంది యువతీ, యువకులకు ఉపాధి కల్పించబోతున్నామని ఆన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో ఉత్తర నియోజకవర్గం పరిధిలోగల కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు మహిళలు పాల్గొన్నారు